అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

  • హైకోర్టులో మూడు పిటిషన్లపై జరిగిన వాదనలు
  • స్కిల్ డెవలప్ మెంట్,  అమరావతి రింగ్ రోడ్డు కేసులపై  విచారణ
  • రింగ్ రోడ్డు విచారణ ఈ నెల 19కి వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన రెండు  పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటీషన్, అమరావతి రింగ్ రోడ్డు కేసులో  ముందస్తు బెయిల్  పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాది కోర్టును సమయం అడిగారు. పూర్తి వివరాలతో ఆర్గ్యుమెంట్ ను సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఆ రోజు ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది.

Chandrababu
Telugudesam
AP High Court
CID
Amaravati Inner Ring Road Case
Anticipatory Bail

More Telugu News